సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి 13 రౌండ్ల కాల్పులు
- February 26, 2018
షిల్లాంగ్ : సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మేఘాలయలోని సౌత్ వెస్ట్ కాశీ హిల్స్‌లో ఆదివారం ఉదయం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ తనకు సెలవు కావాలని అసిస్టెంట్ కమాండంట్ ముఖేష్ సీ త్యాగిని కోరాడు. దేశ్వాల్‌కు సెలవు ఇచ్చేందుకు త్యాగి నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన దేశ్వాల్ తన సర్వీస్ రైఫిల్‌తో త్యాగిపై 13 రౌండ్ల కాల్పులు జరపడంతో.. అసిస్టెంట్ కమాండంట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కానిస్టేబుల్ జోగిందర్ కుమార్, ఎస్‌ఐ ఓం ప్రకాశ్ యాదవ్, ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ మీనా ఉన్నారు. కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. అతడి సర్వీస్ రైఫిల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







