ముంబైకి చేరుకున్న శ్రీదేవి పార్థివ దేహం...
- February 27, 2018
అతిలోక సుందరి శ్రీదేవి పార్థివ దేహం ముంబైకి చేరుకుంది. దుబాయ్ నుంచి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో భౌతిక కాయాన్ని శ్రీదేవి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీదేవి నివాసం వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
అంత్యక్రియలను బుదవారం మధ్యాహ్నం విల్లాపార్లేలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. సినీప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో శ్రీదేవి భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి శ్మశానానికి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత అంత్యక్రియలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







