హెరాయిన్‌తో పట్టుబడ్డ ఇద్దరు పౌరులు

- February 27, 2018 , by Maagulf
హెరాయిన్‌తో పట్టుబడ్డ ఇద్దరు పౌరులు

మస్కట్‌: 300,000 ఒమన్‌ రియాల్స్‌ విలువైన ఆరు కిలోల బరువైన హెరాయిన్‌తో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. షినాస్‌లో వీరిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. సముద్రం ద్వారా సుల్తానేట్‌లోకి ఈ హెరాయిన్‌ని స్మగుల్‌ చేస్తూ నిందితులు పోలీసులకు చిక్కారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నార్కోటిక్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ - నార్త్‌ బతినా ఈ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేసిందని అధికారులు వివరించారు. వారి నుంచి జిపిఎస్‌ డివైజ్‌లు, ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com