కువైట్ - కోచి సర్వీసును ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా
- February 28, 2018
కువైట్: మార్చి 25 నుంచి కువైట్ నుంచి కోచి వరకు కొత్త శీతాకాల షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. ఈ కొత్త మార్గం కువైట్ నుంచి కొచ్చికి వయా ధమ్మం వారానికి మూడుసార్లు ఉంటుంది. ఈ కువైట్ - కోచి సర్వీసు బుధవారం, శుక్రవారం, ఆదివారాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఫ్లైట్ ఐఎక్స్ - 495 విమానం ఉదయం 8.15 గంటలకు కోచిలో బయలుదేరి , అదేరోజు ఉదయం కువైట్ లో 10.55 గంటలకు చేరుకొంటుంది. అలాగే కువైట్ లో కోచికి బయలుదేరే విమానం ఉదయం 11.55 గంటలకు కువైట్ లో బయలుదేరి వయా ధమ్మం మీదుగా కోచికి 9.05 గంటలకు చేరుకొంటుంది.. ఈ కొత్త మార్గం ఇప్పటికే ఉన్న కువైట్ - కోజికోడ్- కొచ్చి మార్గంలో అదనంగా ఉంది. అల్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె . శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది లాభాన్ని సంపాదించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ భరోసానిచ్చింది. బడ్జెట్ లాభం రూ .208 కోట్లు, కాని అసలు లాభం రూ. 250 కోట్లు రావచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 297 కోట్ల కంటే తక్కువగా ఆదాయం ఉంది. ఎందుకంటే ఇంధన ధరలలో 7 నుంచి 10 శాతం పెంపు, ముఖ్యంగా ఎకానమీ క్లాసులో ఆ విధంగా జరిగింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు 90 శాతం గల్ఫ్ దేశాల్లోనే ఉన్నాయి.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







