రేపటి నుంచి బంద్ ప్రకటించిన సినిమా థియేటర్లు
- March 01, 2018
సినిమా హాల్స్ లో డిజిటల్ ప్రొజెక్షన్ సేవలందిస్తున్న సంస్థలతో పలుమార్లు తాము జరిపిన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలనే నిర్ణయించుకున్నామని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర ప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శన ఉండవది వర్చువల్ ప్రింట్ ఫీస్ (వీపీఎఫ్) చార్జీలను రద్దు చేయాలని తాము ఎంతగా విన్నవించుకున్నా డిజిటల్ సేవల సంస్థలు నిరాకరించాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ మూడుసార్లు కంపెనీలతో సమావేశమై తమ ఆలోచనలను పంచుకున్నామని, వారు ససేమిరా అన్నారని, ప్రొవైడర్ల తరఫున హాజరైన ఓ వ్యక్తి, "ఆల్ ది బెస్ట్ టు ద ఇండస్ట్రీ" అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని దామోదర ప్రసాద్ ఆరోపించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడిన డిజిటల్ విభాగం, ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని, అందుకే దక్షిణాదిన అన్ని రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై నిలిచి థియేటర్ల బంద్ చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గత రెండు నెలల నుంచి డిజిటల్ ధరలు ఎంతో పెరిగాయని, డిజిటల్ సేవలు మొదలైన ఐదేళ్ల తరువాత వీపీఎఫ్ రద్దు కావాల్సి వుందని, ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతి ఉండగా, ఇండియాలో మాత్రం డిజిటల్ కంపెనీలు మాట వినడం లేదని ఆయన తెలిపారు. ఈ పోరాటానికి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల యాజమాన్యం పూర్తి మద్దతు పలికిందని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒకే మాటపై ఉన్నారని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







