త్వరలో ట్యాక్సీలకు మీటర్లు తప్పనిసరి: అల్ ఫుతైసి
- March 01, 2018
మస్కట్: మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ ఫుతైసి, ఒమన్‌లో అన్ని ట్యాక్సీలకు త్వరలో మీటర్లు తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించారు. మస్కట్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన అల్ ఫుతైసి, కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఒమన్‌లో అన్ని ట్యాక్సీలకూ మీటర్లు తప్పనిసరి. ఇప్పటికిప్పుడు అది కొంచెం కష్టతరమే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారాయన. మీటర్ లేని ట్యాక్సీలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మవసలాట్ 10 కొత్త రూట్స్‌ని ప్రారంభించనున్నట్లు కూడా వివరించారు అల్ ఫుతైసి. కొత్త సర్వీసులు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయనీ, ఈ తరహా విస్తరణతో మవసలాత్ బస్సులకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోందని అల్ ఫుతైసి చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







