నేషనల్ హాలిడేస్ తర్వాత 3 రోజులు సిక్ లీవ్‌లు తీసుకొన్న 40 వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు
- March 01, 2018
కువైట్: అరుదుగా వరుసగా సెలవుల పొందే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోలేదా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు చెందిన 40 వేల మంది ఉద్యోగులు మూడు రోజుల పాటు సిక్ లీవ్ తీసుకున్నారు. సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) ఆదివారం, ఫిబ్రవరి 25, సోమవారం, ఫిబ్రవరి 26 న అధికారిక సెలవులుగా ప్రకటించింది. 57 వ స్వాతంత్ర్య దినోత్సవం మరియు కువైట్ యొక్క 27 వ లిబరేషన్ డే గుర్తుగా ఈ సెలవులు వారాంతాన్ని అనుసరిస్తూ ఉండటంతో, పని నుండి మొత్తం నాలుగు రోజులు సెలవులు అయినప్పటికీ, దిరికిందే తడవుగా గత నెల ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 ( శనివారం) వరకు తొమ్మిది రోజులకు సెలవులను పొడిగించటానికి అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు అనారోగ్య సెలవును తీసుకున్నారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం, సి ఎస్ సి అధికారులు ఉద్యోగులు పెట్టిన సెలవులు వాస్తవమైనవా కాదా అని నిర్ణయించడానికి వారి వారి సిక్ లీవ్ లను పరిశీలిస్తున్నారు. ఏ ప్రభుత్వ వుద్యోగైనా చట్టాలు మరియు నిబంధనలను ప్రకారం నిరూపించబడకాపోతే చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. సిక్ లీవ్ లను పెట్టిన రోగుల ఆరోగ్య రికార్డులను అధ్యయనం చేయటం మరియు సిక్ లీవ్ దినంను సమర్ధిస్తూ సంతకం చేసిన వైద్యులపై దర్యాప్తు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







