ఏప్రియల్ 1 నుంచి..విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేయనున్న సౌదీ అరేబియా
- March 02, 2018
రియాద్: ' చమురు లో వచ్చిన నష్టం ..పర్యాటకంలో పూరించుకోవాలని ' సౌదీ అరేబియా గత కొంతకాలం చక్కని వ్యూహాలతో ఆర్ధిక రంగాన్ని అదుపులో పెడుతుంది. ‘విజన్ 2030’ ప్రణాళికను అమలుచేసే భాగంగా ఈ ఏడాది ఏప్రియల్ 1 నుంచి విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సాల్మాన్ అంగీకరించారు. 2030 నాటికి ఏడాదికి 30 లక్షల మంది సౌదీలో పర్యటింపచేయడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులను పర్యటానికి అనుమతిస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము పర్యాటక వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చేవారికి వీసాలు జారీ చేయనున్నామని సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునేవారికి ఇది చల్లని కబురేనని పలువురు పర్యటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!