బేబీ క్రీమ్‌పై ఇన్వెస్టిగేట్‌ చేస్తోన్న అబుదాబీ హెల్త్‌ అథారిటీ

- March 02, 2018 , by Maagulf
బేబీ క్రీమ్‌పై ఇన్వెస్టిగేట్‌ చేస్తోన్న అబుదాబీ హెల్త్‌ అథారిటీ

అబుదాబీ:డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌, ప్రస్తుతం అబుదాబీలో అమ్ముడవుతోన్న ఓ బేబీ క్రీమ్‌పై ఇన్వెస్టిగేషన్‌ నిర్వహిస్తోంది. లేబొరేటరీ రిపోర్ట్స్‌ ప్రకారం ఆ క్రీమ్‌, క్వాలిటీ కంట్రోల్‌ స్టాండర్డ్స్‌ని ఏమాత్రం అందుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. డైపర్‌ రాష్‌ క్రీమ్‌కి సంబంధించి మెటాలిక్‌ డెబ్రిస్‌ - ఇర్రెగ్యులర్‌ షేప్స్‌ని గుర్తించినట్లు తెలుస్తోంది. బయోడెర్మా ఎబిసిడెర్మ్‌ (27961), ఎ (22961) (2019 ఆగస్ట్‌తో వీటి ఎక్స్‌పయిరీ ముగుస్తుంది) ప్రోడక్ట్స్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ కమ్యూనిటీ ప్రివెన్షన్‌లో రిజిస్టర్‌ అయి లేవు. ఎమిరేట్‌ వ్యాప్తంగా పలు హెల్త్‌ ఫెసిలిటీస్‌లో వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. హెల్త్‌ బాడీ, తక్షణమే ఫార్మసీస్‌ ఆ ప్రోడక్ట్స్‌ని సప్లయర్‌కి తిప్పి పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టిగేషన్‌ పూర్తయ్యేదాకా ఎవరూ వీటిని విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసింది. డయాపర్‌ రాషెస్‌ని నియంత్రించడానికి ఈ క్రీమ్‌ని ఉపయోగిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com