పర్యాటక రంగంపై దృష్టి సారించనున్న సౌదీ

- March 03, 2018 , by Maagulf
పర్యాటక రంగంపై దృష్టి సారించనున్న సౌదీ

రియాద్: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుుంది. చమురు ఉత్పత్తి ద్వారా ఇన్నాళ్లూ ఆదాయం ఆర్జించిన సౌదీ ఇప్పుడు రూటు మార్చింది. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని భావిస్తున్న ఆ దేశం తాజాగా పర్యాటకరంగం నుంచి ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది.

ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి 'విజన్ 2030' ప్రణాళికను అమలు చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పచ్చజెండా ఊపారు.

2030 నాటికి ఏడాదికి 30 మిలియన్ల మంది సౌదీలో పర్యటించేలా చేయడమే ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులకు టూరిస్టు వీసాలు జారీ చేస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము కూడా టూరిస్టు వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.

అంతేకాదు.. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చే వారికి కూడా అవసరమైన వీసాలు జారీ చేయనున్నట్లు సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునే వారికి ఇది శుభవార్తేనని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు.

వచ్చే జూన్‌లో సౌదీ ఆరేబియా రాజుగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రస్తుత యువరాజు సల్మాన్ పలు కీలకమైన సంస్కరణలకు నడుం బిగించారు. మహిళలకు కారు డ్రైవింగ్ అనుమతితోపాటు, సౌదీ చరిత్రలో మొదటిసారిగా మగవారి తోడు లేకుండా మహిళలకు ప్రయాణానికి అనుమతి, సినిమా థియేటర్లు తెరవడం వంటి కొన్ని కీలక సంస్కరణ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com