ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్!

- March 03, 2018 , by Maagulf
ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్!

షార్జా: గల్ఫ్ దేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. షార్జా నగర వేదికగా పనిచేస్తున్న విమానయాన సంస్థ ఎయిర్‌ అరేబియా బంఫరాఫర్ ప్రకటించింది. యూఏఈ నుంచి భారత్ వెళ్లాలనుకునే వారికి తక్కువ ధరలకే విమాన టికెట్ అందిస్తామని ప్రకటించింది.

అయిన వారికి దూరంగా ఎక్కడో ఎడారి దేశాల్లో ఉంటోన్న ఎంతోమంది స్వదేశానికి వచ్చి తమ కుటుంబ సభ్యులను చూడాలని ఉన్నా విమాన టిక్కెట్ ధరలు భరించలేక ఆ కోరికను తమలోనే దిగమింగుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇది ఎంతో ఊరట కలిగించే విషయమే.

షార్జా నుంచి తిరువనంతపురానికి కేవలం 274 దిర్హమ్స్ మాత్రమే వసూలు చేస్తామని ఎయిర్‌ అరేబియా ప్రకటించింది. అంతేకాకుండా ఇతర నగరాలైన కొచ్చికి 280 దిర్హమ్స్, కోయంబత్తూర్ 350 దిర్హమ్స్, బెంగళూరు 345 దిర్హమ్స్‌కే టికెట్ అందిస్తామని ప్రకటించింది.

ఒక్క భారత్‌కే కాకుండా పలు ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ల ఈ విమానయాన సంస్థ అందించింది. విమాన టికెట్ ధరలను తగ్గించి ప్రయాణికులను ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com