పర్యావరణ నేరంలో నిందితుడు ...పరారీకి యత్నం
- March 03, 2018
కువైట్ : తీవ్రమైన పర్యావరణ నేరానికి పాల్పడి జైలుశిక్ష విధించబడిన ఓ నిందితుడు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చల్లగా జారుకొనేందుకు చేసిన ప్రయత్నాన్ని నిలువరించి పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. శిక్ష విధించడంతో దేశం నుండి తప్పించుకోవడానికి ముద్దాయి ప్రయత్నించి మరో తప్పు చేశాడు. కంప్యూటర్ సిస్టంలో ఐడెంటిటీ వెరిఫికేషన్ సమాచారంలో నిందితుడు దేశం వెలుపలకు ప్రయాణించే అవకాశం నిషేధించబడటమే కాక ఒక నేరంలో జైలుశిక్ష అనుభవించడానికి అరెస్టు చేయాల్సివుందని వాస్తవం వెలువడటంతో విమానాశ్రయ అధికారులు ఆ అనుమానిత వ్యక్తి గురించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. అనుమానిత వ్యక్తి ప్రమాదకర పదార్థాన్ని ఎడారి ప్రాంతంలోకి వదిలేందుకు యత్నించగా గుర్తించి నిందితుడిని దోషిగా గుర్తించారు. పర్యావరణ చట్ట ప్రకారం ఆ నిందితుడికి జైలు శిక్ష విధించే నేరం మరియు 10,000 కువైట్ దినార్లను వరకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







