ఓమారియాలో సొంత సోదరడినే ఏ కె 47 తో కాల్చి చంపిన దుర్మార్గుడు

- March 03, 2018 , by Maagulf
ఓమారియాలో సొంత సోదరడినే  ఏ కె 47 తో కాల్చి చంపిన దుర్మార్గుడు

కువైట్:  కొందరు దుర్మార్గులు పట్టరాని ఆగ్రహాలతో ..ఉన్మాదులుగా మారి రక్త సంబంధీకులనే రాక్షసంగా అంతమొందిస్తున్నారు శుక్రవారం ఓమారియాలో జరిగిన ఒక దారుణ ఘటనలో సొంత సోదరడినే  ఏ కె 47 తో తలపై కాల్చి చంపి అక్కడినుంచి పరారైయ్యాడు ఓ దుర్మార్గుడు . కాల్పులకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. దాంతో వారు వెంటనే స్పందించి నేరం జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. తలలోనికి పలు బులెట్లు దూసుకుపోవడంతో బాధితుడు ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. హంతకుడు గతంలో ఒక నేరంలో నిందితుడు కాగా శిక్షను అనుభవించి వారం రోజుల ముందు జైలు నుండి విడుదలైనట్లు అపరాధ పరిశోధకులు కనుగొన్నారు. సోదరుడిని దారుణంగా చంపిన తర్వాత ఒక కారులో పరారవుతున్న హంతకుడి వాహనంలో అకస్మాత్తుగా ఇంధనం అయిపోవడంతో  కారు ఆగిపోయింది. దీంతో వెతుకుతున్న పోలీసులకు నిందితుడు సులువుగా దొరికిపోవడంతో అరెస్టు చేశారు. హంతకుని వద్ద  హత్య ఆయుధాలను పోలీసులు కనుగొన్నారు. ఏకే 47 గన్ కారులో లభించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క సంబంధాలు మరియు భద్రతా సమాచార విభాగం తెలిపింది. నిందితుడు తన కుటుంబ సభ్యులను  శారీరకంగా హింసించే నేరానికి పాల్పడిన వ్యక్తి అని ఆ కేసులో జైలు శిక్ష సైతం అనుభవించాడని తెలిసింది. నిందితుడిపై  తదుపరి చర్య కోసం సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com