ఈ నెల 29న 'ఇరుంబు తిరై' విడుదల సన్నాహాలు
- March 03, 2018
విశాల్ హీరోగా సొంత బ్యానరు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న చిత్రం 'ఇరుంబు తిరై'. మిత్రన్ దర్శకత్వంలోని ఈ సినిమాలో సమంత కథానాయిక. అర్జున్ విలన్ పాత్ర పోషించారు. విశాల్ గురువు అర్జున్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా వాణిజ్య పనులు ఊపందుకున్నాయి. కేరళ మార్కెట్‌కు సంబంధించిన హక్కులను శిబు తమీమ్ సొంతం చేసుకున్నారు. విజయ్ నటించిన 'పులి', విక్రం నటించిన 'ఇరుముగన్' చిత్రాలను గతంలో నిర్మించారు శిబు. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విక్రం నటిస్తున్న 'సామి స్క్వేర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశాల్‌కు కేరళలో మార్కెట్ బాగుంది. అందుకే మరింత గ్రాండ్‌గా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు తమిళంలో కూడా పంపిణీ పనులు ఆరంభమయ్యాయి. మార్చి 29వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు.a
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







