నేడు హైదరాబాద్‌లో అతిలోక సుందరికి సంతాప సభ
- March 03, 2018
హైదరాబాద్: అతిలోకసుందరి, లెజండరీ నటి, ఇండియన్ స్టార్ శ్రీదేవి.. కోట్లాది మంది అభిమానులను, వేలాదిమంది నటీనటులను విషాదంలోకి నెట్టేసి తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చనిపోలేదని ఇదంతా కలయేనని కొందరు వీరాభిమానులు, ఆరాధ్యులు భ్రమలో ఉన్నారంటే శ్రీదేవి రేంజ్ ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. కాగా ఆమె అంత్యక్రియలు టాలీవుడ్ ప్రముఖులు తరలివెళ్లిన విషయం విదితమే.
అయితే శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి టాలీవుడ్ ఓ వేదికను ఏర్పాటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆదివారం ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు సంతాప సభ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు సంతాప సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలిసింది. కాగా ఈ సందర్భంగా ఆర్జీవీ సభలో ప్రసగించనున్నారని.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వరుస ట్వీట్లు, శ్రీదేవి అభిమానులకు లేఖ ఇలా ఆర్జీవీలోని బాధనంతా బయటపెట్టినప్పటికీ పాపం.. ఇంకా విషాదంలో నుంచి కోలుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







