'భరత్ అనే నేను' విజన్ టాక్!
- March 05, 2018
కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న "భరత్ అనే నేను" సినిమాపై అంచనాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి ఒక్క అంశంపై అభిమానులు హార్షాతిరేకాలు వ్యక్తం చేయగా, ఇపుడు కీలకమైన టీజర్ విడుదలకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. 'భరత్ అనే నేను విజన్' పేరుతో 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రకటనతో పాటు కుర్చీ పట్టుకుని ప్రిన్స్ ఆలోచిస్తోన్న ఓ ఫోటోను రిలీజ్ చేసారు. సింపుల్ లుక్ లో ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ పోస్టర్ కు రిప్లై ఇచ్చిన చిత్ర సంగీత దర్శకుడు 'భరత్ అనే నేను' విజన్ టాక్ ను ట్విట్టర్ వేదికగా వ్యక్తపరిచారు. "అవును. కొరటాల శివ అందించిన 'విజన్ ఆఫ్ భరత్' బాగుందని, మీరంతా కూడా దీనిని ప్రేమిస్తారని, రెడీ గైస్." అంటూ తన భావాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు దేవిశ్రీ.
దీనికి ప్రతిస్పందించిన దర్శకుడు కొరటాల శివ "నీవు అందించిన సంగీతం విజన్ ఆఫ్ భరత్ ను మరింత హైలైట్ అయ్యేలా చేసిందని" చెప్పగా, "మీరు తీసిన ప్రతి విజువల్ నన్ను ఇన్ స్పైర్ చేశాయని, ఖచ్చితంగా నా పరిధి మేరకు బెస్ట్ అందిస్తానని" దేవి మళ్ళీ బదులిచ్చారు. మొత్తం ఈ సంభాషణ ద్వారా అభిమానులకు అర్ధమవుతున్న విషయం ఏమిటి అంటే. "భరత్ అనే నేను"లో కొరటాల బెస్ట్ చూడబోతున్నాము అని!
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







