కువైట్ ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగాలలో ప్రవాసీయుల తగ్గింపు

- March 05, 2018 , by Maagulf
కువైట్  ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగాలలో ప్రవాసీయుల తగ్గింపు

కువైట్: వివిధ మంత్రిత్వశాఖలు మరియు రాష్ట్ర విభాగాలలో పనిచేసే ప్రవాసీయులను తొలగించాలని రద్దు చేసిన ప్రవాసీయుల ఉద్యోగాలలో స్థానిక పౌరులతో భర్తీ చేయడానికి కువైట్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.   ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ప్రాఖ్వాసీయులతో ఒప్పందపు ఉద్యోగాలు  పొడిగించబడవు లేదా పునరుద్ధరించబడవు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం, వేలాది మంది నిర్వాసితులు ఏ ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేయడానికి అనుమతించబడరు. ప్రభుత్వ మండళ్లలో నిర్వాసితులు నియమించడం లో మినహాయింపులు లేవు. సివిల్ సర్వీస్ కమిషన్ (సి ఎస్ సి) నుండి పౌరసభ్యులను నియమించలేని ప్రత్యేకత పరిస్థితులలో మాత్రమే ప్రవాసీయులతో నియామకం చేయాలని ఆ దినపత్రిక  నివేదించింది .ఒక ప్రభుత్వ నిర్ణయం ప్రకారం  దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో  ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కృషి చేయాలనీ సూచిస్తుంది.  ఆ తరహాలోనే ప్రతి ఏడాది నిర్వాసిత ఉద్యోగులను తగ్గిస్తూ 2022 నాటికి ప్రభుత్వం కువైటీకరణ  ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ప్రవాసియ ఉద్యోగుల జాబితా తగ్గుదల ఉండాలని సూచిందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com