రక్షణ రంగ బడ్జెట్‌ పెంచేసిన చైనా

- March 05, 2018 , by Maagulf
రక్షణ రంగ బడ్జెట్‌ పెంచేసిన చైనా

చైనా రక్షణ రంగ బడ్జెట్‌ దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని విధంగా కేటాయింపులు పెంచేసుకుంటున్నారు. గతేడాది పెరిగితేనే అబ్బో అన్నాయి ప్రపంచదేశాలు. ఈ దఫా ఏకంగా 8.1శాతం పెంచేసింది డ్రాగన్. చెప్పాలంటే మనకన్నా మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్ అది. ప్రపంచంలో అమెరికా తర్వాత రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనానే.
డ్రాగన్ చైనా రక్షణ రంగ బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. అమెరికా తర్వాత డిఫెన్స్ శాఖకు అంతలా నిధులు కేటాయిస్తున్న రెండో దేశం చైనాయే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను 8.1శాతం పెంచినట్లు చైనా ప్రకటించింది. 175 బిలియన్‌ డాలర్లను రక్షణ రంగానికి కేటాయించినట్లు తెలిపింది. భారత రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. 

చైనా సమర్పించిన 2018 బడ్జెట్‌ నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. గత ఏడాది రక్షణ బడ్జెట్‌ను ఏడు శాతం పెంచిన చైనా ఈ ఏడాది ఇంకాస్త ఎక్కువగా 8.1శాతం పెంచింది. అమెరికా డిఫెన్స్ బడ్జెట్‌ 602 బిలియన్‌ డాలర్లు. భారత్‌ రక్షణ రంగానికి తాజాగా 52.5 బిలియన్‌ డాలర్లు కేటాయించగా.. చైనా మన కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ కేటాయించింది. 
చైనా గత ఏడాది రక్షణ రంగానికి 150.5బిలియన్‌ డాలర్లు కేటాయించింది. అప్పుడే చైనా చాలా ఎక్కువగా రక్షణ రంగానికి కేటాయిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. చైనా రెండు కొత్త విమాన వాహక నౌకలు ఎయిర్ క్యారియర్స్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే ఒక విమాన వాహక నౌక సేవలు అందిస్తోంది. అలాగే కొత్త జే-20 యుద్ధ విమానాలు సహా మరికొన్ని కొత్త జెట్‌లను తయారు చేస్తోంది. అటు నావికా దళ సేవలనూ విస్తరించుకుంటోంది డ్రాగన్. 
ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే చైనా జీడీపీలో రక్షణ బడ్జెట్‌ ప్రభావం తక్కువగా ఉందని ఆ దేశ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మిలటరీ ఎక్విప్‌మెంట్‌ అప్‌గ్రేడ్‌ చేయడానికి, సైనికులు, మహిళల సంక్షేమం, కిందిస్థాయి బలగాల నివాస, శిక్షణ పరిస్థితులు, వసతులను మరింత మెరుగుపరిచేందుకు బడ్జెట్‌ను పెంచినట్లు కవర్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com