ఏ.పి లో పెరిగిన ఉష్ణోగ్రతలు!

- March 05, 2018 , by Maagulf
ఏ.పి లో పెరిగిన ఉష్ణోగ్రతలు!

విశాఖపట్నం: రానున్న 2, 3 రోజుల్లో కోస్తా రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2, 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38, 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సోమవారం రికార్డయిన ఉష్ణోగ్రతలు చూస్తే రాయలసీమలో కర్నూలు 39, అనంతపురం 38, కోస్తాలోని తుని, విజయవాడలలో 37 డిగ్రీలు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com