మలేషియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

- March 06, 2018 , by Maagulf
మలేషియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

మలేషియాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువకులకు టోకరా,ఒక్కొక్కరి దగ్గర సుమారు లక్ష రూపాయలు నుండి రెండు లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు వేంపల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లి గరుగు వీధికి చెందిన ఫక్రుద్దీన్‌, అతను అల్లుడు సలీమ్‌ ఇద్దరు ఏజెంట్లు కలిసి మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువకుల వద్ద నుంచి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేసి వారికి టూరిస్టు విసా ఇచ్చి మలేషియా విమానం ఎక్కించారు.టూరిస్టు విసా సమయం గడువు ముగియగానే మలేషియా పోలీసులు వారిని అరెస్టు చేసి జైల్‌లో ఉంచారు. మోసపోయిన బాధితులు ఎలాగోలా కష్టపడి స్వదేశానికి తిరిగి వచ్చారు.వారిని ఏజెంటు మళ్ళీ మలేషియా పంపించాడు. రెండో సారి కూడా టూరిస్టు విసాతోనే పంపించాడు.వారిని మలేషియా పోలీసులు ఎయిర్‌ పోర్ట్‌లోనే అరెస్ట్‌ చేసి నాలుగు రోజుల తర్వాత తిరిగి వెనక్కి పంపారు. మంగళవారం యర్రగుంట్ల మండలం చిలమకూరుకు చెందిన బాధితులు షేక్‌.సాధక్‌ వల్లి,షేక్‌.ఇమామ్‌,షేక్‌.గపూర్‌, షేక్‌.ఖాసీం పిరా,వేంపల్లికి చెందిన నరేష్‌,కడపకు చెందిన శ్రీనివాసులు కలిసి ఏజెంటు ఫక్రుద్దీన్‌ ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వాలని అడిగారు.అతను వారికి సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోపోండి అని దురుసుగా మాట్లాడటంతో దిక్కు తోచని స్థితిలో బాధితులు వేంపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఎస్‌ఐ బి.వి.చలపతి మాట్లాడుతూ ఏజెంటు ఫక్రుద్దీన్‌ను విచారించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com