హైదరాబాద్లో కాల్పుల కలకలం
- March 06, 2018
హైదరాబాద్: నగరంలోని చార్మినార్ సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది. నగల వ్యాపారి ఇంట్లో చొరబడిన దుండగులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఇది చార్మినర్ పరిసర ప్రాంతం కావడంతో మరింత కలకలం రేపుతోంది. సిటీ ఆర్మ్డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్స్ కార్యాలయం వెనుక కొంతమంది నగల వ్యాపారులు చిన్న చిన్న ఖార్కానాలు పెట్టుకుని బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. దుండగులు పక్కా పథకం ప్రకారం 10 నుంచి 15 మంది యువకులు మోటారు బైకులు, కారులో అక్కడకు వచ్చి ఖార్కానాలో పనిచేస్తున్న కార్మికులను తుపాకులతో బెదిరించి..గాలిలోకి కాల్పులు జరిపి... 5 కిలోల బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు హిందీ మాట్లాడారని, హైదరాబాద్కు చెందినవారు కాదని కార్మికులు చెప్పడంతో... ముంబైకి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ దోపిడీ జరిగిన తర్వాత చూస్తే సీసీ కెమెరా వైర్లు కత్తిరించి ఉన్నాయి. పక్కా రెక్కి నిర్వహించి దోపిడీ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చుట్టుప్రక్క ప్రాంతాల, సరిహద్దు పోలీసులకు సమాచారం అందించి నాకాబంది చేస్తున్నారు. దుండగులు రెండు బైకులు సంఘటనా ప్రదేశంలో వదిలి వెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







