మలేషియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
- March 06, 2018
మలేషియాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువకులకు టోకరా,ఒక్కొక్కరి దగ్గర సుమారు లక్ష రూపాయలు నుండి రెండు లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు వేంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లి గరుగు వీధికి చెందిన ఫక్రుద్దీన్, అతను అల్లుడు సలీమ్ ఇద్దరు ఏజెంట్లు కలిసి మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువకుల వద్ద నుంచి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేసి వారికి టూరిస్టు విసా ఇచ్చి మలేషియా విమానం ఎక్కించారు.టూరిస్టు విసా సమయం గడువు ముగియగానే మలేషియా పోలీసులు వారిని అరెస్టు చేసి జైల్లో ఉంచారు. మోసపోయిన బాధితులు ఎలాగోలా కష్టపడి స్వదేశానికి తిరిగి వచ్చారు.వారిని ఏజెంటు మళ్ళీ మలేషియా పంపించాడు. రెండో సారి కూడా టూరిస్టు విసాతోనే పంపించాడు.వారిని మలేషియా పోలీసులు ఎయిర్ పోర్ట్‌లోనే అరెస్ట్ చేసి నాలుగు రోజుల తర్వాత తిరిగి వెనక్కి పంపారు. మంగళవారం యర్రగుంట్ల మండలం చిలమకూరుకు చెందిన బాధితులు షేక్.సాధక్ వల్లి,షేక్.ఇమామ్,షేక్.గపూర్, షేక్.ఖాసీం పిరా,వేంపల్లికి చెందిన నరేష్,కడపకు చెందిన శ్రీనివాసులు కలిసి ఏజెంటు ఫక్రుద్దీన్ ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వాలని అడిగారు.అతను వారికి సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోపోండి అని దురుసుగా మాట్లాడటంతో దిక్కు తోచని స్థితిలో బాధితులు వేంపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఎస్ఐ బి.వి.చలపతి మాట్లాడుతూ ఏజెంటు ఫక్రుద్దీన్‌ను విచారించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







