నందిని రెడ్డిని సత్కరించనున్న టీ-ప్రభుత్వం

- March 07, 2018 , by Maagulf
నందిని రెడ్డిని సత్కరించనున్న టీ-ప్రభుత్వం

టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ నెల 8వ తేదిన అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను సన్మానించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలోనే సినీ రంగం నుంచి నందిని రెడ్డిని ఎంపిక చేశారు. టాలీవుడ్ లో రాణిస్తున్న ఏకైక మహిళా దర్శకురాలుగా నందిని రెడ్డి ని చెప్పుకోవాలి. ఆమె 'అలా మొదలైంది' సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నాని ఇప్పుడు స్టార్ హీరోలకే స్టార్ హీరో అనిపించుకొంటున్నాడు. ఆ తర్వాత 'కళ్యాణ వైభోగమే' సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు నందిని రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com