కేంద్రమంత్రులు రాజీనామా:ఏ.పి సీఎం

- March 07, 2018 , by Maagulf
కేంద్రమంత్రులు రాజీనామా:ఏ.పి సీఎం

కేంద్రం నుంచి మంత్రులు ప్రభుత్వం నుంచి బయటకు వస్తారని చంద్రబాబు చెప్పారు. అందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ఏ పదవులు తీసుకోకుండా గతంలో కేంద్రానికి సహకరించామన్నారు. అమరావతిలో చంద్రబాబు మీడియా సమావేశంలో మట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం నుంచి వైదొలగాలని నిర్ణయించకున్నామన్నారు. ప్రధాని మోడీతో మాట్లాడాలని ప్రయత్నించానని, కాని సాధ్యం కాలేదన్నారు. అసెంబ్లీలో చాలా విపులంగా అంతా చెప్పానని, కాంగ్రెస్, బీజేపీలు చేసిన విషయాలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించానన్నారు. తాను అసెంబ్లీలో మాట్లాడిన కొంత సమయానికే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం పెట్టి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పారని, సెంటిమెంట్ తో కేటాయింపులు జరగవని చెప్పారని, ఇవన్నీ చూసిన తర్వాత కేంద్రం సాయం చేసే ఉద్దేశ్యం కనపడలేదన్నారు. తనకు జైట్లీ ప్రకటన బాధించిందన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు రాలేదని, దశలవారీగా తమ నిరసనను తెలియజేస్తామని చంద్రబాబు తెలిపారు. కేంద్రంలో కొనసాగుతున్న తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు రేపు రాజీనామా చేస్తారని చంద్రబాబు వెల్లడించారు. రేపు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com