నేటి నుంచి హైదరాబాద్‌లో ఎయిర్ షో
- March 07, 2018
నగరానికి మరోమారు విమానాలపండుగ వచ్చింది. తమలో దాగిన సాంకేతికాంశాలను తెలియజేయడంతో పాటు విమానయాన రంగంలో ఉన్న అపార అవకాశాల గురించి తెలియజేయడానికి లోహవిహంగాలు సిద్ధమయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2018 శీర్షికన ఈ షోను నిర్వస్తున్నారు. అంతర్జాతీయ ప్రదర్శన, పౌర విమానయాన సదస్సులో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. వీరితోపాటు 15కు పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, కార్గో ఎయిర్‌క్రా్‌ఫ్టలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనలో మొదటి రెండు రోజులూ కేవలం బిజినెస్ విజిటర్లకు కేటాయించగా చివరి రెండు రోజులనూ సామాన్య సందర్శకులను సైతం అనుమతిస్తారు. బిజినెస్ విజిటర్లకు 2వేల రూపాయలను ప్రవేశ రుసుముగా నిర్ణయించగా, సామాన్య సందర్శకులకు 400 రూపాయలు వసూలు చేయనున్నారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







