అరేబియా సముద్రంలో మంటల్లో చిక్కుకున్న నౌక

- March 08, 2018 , by Maagulf
అరేబియా సముద్రంలో మంటల్లో చిక్కుకున్న నౌక

అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌కు సమీపంలో డెన్మార్క్‌లోని మెర్‌స్క్ కంపెనీకి చెందిన వాణిజ్య నౌకలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత రెండు రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. నౌకలో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ పైఅధికారులకు సమాచారమందించారు. దీనిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో నలుగురు ఆచూకీ దొరకడం లేదు. మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com