తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు
- March 08, 2018
దిల్లీ: అంతర్జాతీయ బలహీన సంకేతాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో గురువారం నాటి మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 220 తగ్గి రూ. 31,450కి చేరింది. అటు వెండి కూడా నేడు బంగారం బాటలోనే పయనించింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 39,500కు పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూయార్క్లో బుధవారం నాటి మార్కెట్లో పసిడి ధర 0.70శాతం తగ్గి ఔన్సు ధర 1,324.90డాలర్లు పలికింది. వెండి కూడా 0.53శాతం పడిపోయి ఔన్సు ధర 16.47గా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







