'హలో గురు ప్రేమ కోసమే' సినిమా ప్రారంభం
- March 08, 2018రామ్ కథానాయకుడిగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న కొత్తచిత్రం 'హలో గురు ప్రేమ కోసమే'. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అతిథులు ఎర్నేని నవీన్, స్రవంతి రవికిశోర్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టారు. అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేయగా హరీశ్ శంకర్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. 'ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న రెండో చిత్రమిది. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 'నేను లోకల్' వంటి హిట్ తర్వాత త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. మార్చి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నాడు. రచన: సాయికృష్ణ, కళ: సాహి సురేశ్, కూర్పు: కార్తీక్ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: విజయ్ కె.చక్రవర్తి.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!