అమెరికా డ్రోన్ దాడుల్లో గూగుల్‌కూ పాత్ర
- March 08, 2018
వాషింగ్టన్ : అమెరికా అక్రమంగా సాగిస్తున్న డ్రోన్ దాడుల కార్యక్రమంలో తాము కూడా సహకరించామని గూగుల్ అంగీకరించింది. ఆ దాడుల లక్ష్యాలను గుర్తించడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తాము అందించామని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ స్పష్టం చేసింది. 2009లో అమెరికా డ్రోన్ దాడి కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుండి దాదాపు 3వేల మందిని హతమార్చినట్లు అమెరికా చెప్పుకుంటోంది. డ్రోణ్ దాడిలో లక్ష్యమైన ఒక వ్యక్తితో పాటు 9మంది పక్కవారు కూడా మరణించారని అంతర్గత సైనిక పత్రాల్లో వెల్లడవుతోంది. అంటే దీన్నిబట్టి యెమెన్, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్‌ల్లో అమెరికా సైన్యం సాగించిన తీవ్రవాద దాడుల్లో మృతుల సంఖ్య వేల సంఖ్యలోనే వుందని వెల్లడవుతోంది. డ్రోణ్ దాడుల కార్యక్రమంలో గూగుల్ పాత్ర వుండడంతో అమెరికా సైన్యం నేరపూరిత కార్యకలాపాల్లో కూడా దానికి భాగమున్నట్లు స్ఫష్టమైంది. గత వారం అంతర్గత మెమోలో గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో గూగుల్ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!