విషాదాన్ని దిగమింగి మళ్ళీ షూటింగ్ లో జాన్వి..!
- March 08, 2018
శ్రీదేవి సడెన్ డెత్ తో కుటుంబ సభ్యులతో పాటు.. సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు షాక్ కి గురయ్యాయి. ఇక శ్రీదేవి కి అత్యంత ఇష్టమైన కూతురు జాన్వికి తల్లి మరణం తీరని తీరని లోటు.. ఇక రెండు రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును అనాథాశ్రమంలో జరుపుకొన్నది.. కాగా జాన్వి తల్లి విషాదాంతాన్ని దిగమింగుకొని ధడక్ సినిమా సెట్ లో అడుగు పెట్టింది. తల్లి మరణంతో షూటింగ్ కు చాలా రోజులు బ్రేక్ ఇచ్చినా.. షెడ్యూల్ ప్రకారం మూవీ విడుదలకు సహకరించెందుకు సినిమా షూటింగ్ హాజరు కావాలని జాన్వి నిర్ణయించుకొన్నది. దీంతో బాంద్రా కార్టర్ రోడ్డులో సహ నటుడు ఇషాన్ ఖట్టర్ తో కలిసి జాన్వి షూటింగ్ లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ ను జరుపుకొని నెక్స్ట్ వీక్ చిత్ర యూనిట్ ఇంటర్వెల్ సీన్స్ ను తెరకెక్కించేందుకు కోల్ కతా పయనంకానున్నది. తమ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది అని దర్శకుడు శశాంక్ ఖైతాన్ చెప్పారు. తన కూతుర్ని వెండి తెరపై చూసుకోవాలి అన్న కోరిక తీరకుండానే.. శ్రీదేవి మృతి చెందింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







