విడుదలకు సిద్ధమైన 'తొలికిరణం' సినిమా
- March 08, 2018
కంప్యూటర్ గ్రాఫిక్స్ రూపకల్పనలో జరుగుతున్న ఆలస్యమే చిత్ర విడుదలలో జాప్యం జరిగేందుకు కారణమని చెబుతున్నారు తొలి కిరణం చిత్రయూనిట్ సభ్యులు. సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జాన్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భానుచందర్ కీలక పాత్రలో నటించగా.పీడీ రాజు ఏసుక్రీస్తు పాత్రను పోషించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తొలి కిరణం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భగా నటుడు భానుచందర్ మాట్లాడుతూ.ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాలన్నీ ఏసుక్రీస్తు జన్మించినప్పటి నుంచి శిలువ వేసే వరకు సాగుతాయి. ఆయన మరణించిన మూడు రోజుల తర్వాత సమాధి లోనుంచి లేచి వచ్చి శాంతి సందేశాన్నిస్తూ భూమిపై తిరిగారు. ఆ కథను తొలి కిరణం సినిమాలో దర్శకులు జాన్‌బాబు చూపిస్తున్నారు. సినిమా రషెస్ చూశాను చాలా చక్కగా సినిమాను రూపొందించారు. మా అబ్బాయి హీరోగా నా కొడుకు బంగారం అనే చిత్రాన్ని జాన్‌బాబు గారి దర్శకత్వంలోనే చేయబోతున్నాం. అన్నారు. దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ.లండన్‌లో గ్రాఫిక్స్ పనులు జరగడంలో ఆలస్యమైంది. అందుకే చిత్రాన్ని కొద్ది జాప్యంతో విడుదల చేస్తున్నాం. అన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







