మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న నెటిజన్స్

- March 09, 2018 , by Maagulf
మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న నెటిజన్స్

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మహేష్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' టీజర్ చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ టీజర్‌నే భారత ప్రధాని నరేంద్ర మోడీకి అన్వయిస్తున్నారు నెటిజన్స్. 'చిన్నప్పుడు మా అమ్మా నాకో మాట చెప్పింది. ఒక ప్రామిస్ చేసి మాట తప్పమని. ఎప్పటికీ  ఇచ్చిన మాట నెరవేర్చనని.. నా జీవితంలో అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. అది చాలా కష్టమైంది. ఎంత కష్టమొచ్చినా.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆమెకు ఇచ్చిన మాట తప్పలేదు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోలేదు. ఈ విషయంలో నా విశ్వసనీయతను కోల్పోయినా మా అమ్మకు నేను చేసిన ప్రామిస్‌ను నెరవేర్చాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను' అంటూ నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com