దుబాయ్‌ ఫ్రేమ్‌ ఫొటో తీసి, ఐ ఫోన్‌ 10 గెల్చుకోండి

- March 09, 2018 , by Maagulf
దుబాయ్‌ ఫ్రేమ్‌ ఫొటో తీసి, ఐ ఫోన్‌ 10 గెల్చుకోండి

దుబాయ్‌:దుబాయ్‌ ఫ్రేమ్‌ని ఫొటో తీస్తే, ఐ ఫోన్‌ 10ని ఉచితంగా గెల్చుకునే అవకాశం వుంది. దుబాయ్‌ ఫ్రేమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు వివరాల్ని వెల్లడించారు. దుబాయ్‌లో న్యూ ల్యాండ్‌ మార్క్‌ అయిన దుబాయ్‌ ఫ్రేమ్‌, ఔత్సాహికులైన ఫొటోగ్రాఫర్లు, అలాగే రెసిడెంట్స్‌కి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఏ లొకేషన్‌ నుంచి అయినా దుబాయ్‌ ఫ్రేమ్‌ ఎక్స్‌టీరియర్‌ని ఫొటో తీస్తే సరిపోతుంది. తీసిన పొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఫ్రేమ్‌ కాప్చర్‌' హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ చేయాల్సి వుంటుంది. దుబాయ్‌ఫ్రేమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ని కూడా యాడ్‌ చెయ్యాలి. దుబాయ్‌ ఫ్రేమ్‌కి చెందిన సోషల్‌ మీడియా ఛానల్స్‌ని కూడా పార్టిసిపెంట్స్‌ ఫాలో అవ్వాల్సి వుంటుంది. పార్టిసిపెంట్లు 18 ఏళ్ళు నిండిన యూఏఈ రెసిడెంట్స్‌ అయి వుండాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com