మహారాష్ట్రలోని రాయగడ్‌లో కూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్

- March 10, 2018 , by Maagulf
మహారాష్ట్రలోని రాయగడ్‌లో కూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్

ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్‌లో శనివారం భారత కోస్ట్ గార్డు హెలికాప్టర్ కూలింది. మురుద్ నంద్గావ్‌లో ఈ ప్రమాదం సంభవించింది.

హెలికాప్టర్‌లో ఎంత మంది ఉన్నారనేది ఇప్పుడే తెలియడం లేదు.హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉన్నారు. ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఓ మహిళ గాయపడింది. ల్యాండ్ అవుతున్న క్రమంలో అది కూలిపోయింది. మధ్యలోనే హెలికాప్టర్‌కు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

ఎప్పటిలాగే ఎగురుతున్న క్రమంలో సమస్య తలెత్తింది. ల్యాండ్ కావడంలో సమస్య తలెత్తి మైదానాన్ని ఢీకొట్టింది. వివరాలు అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com