కమల నాధుల్లో కలవనున్న అలనాటి నటి

- March 11, 2018 , by Maagulf
కమల నాధుల్లో కలవనున్న అలనాటి నటి

విజయవాడ: ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత భారతీయ జనతా పార్టీలో ఆదివారం చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల స్ఫూర్తితో బీజేపీలో చేరానన్నారు. అలాగే నేను టీడీపీ నుంచి బయటకు రాలేదు... గెంటి వేయబడ్డాను అని కవిత అన్నారు. టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడ్డానని, టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, చంద్రబాబును తిడుతున్నవారికి పదవులిచ్చారు... పార్టీ కోసం పనిచేసినవారికి మొండిచేయి చూపారని కవిత పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com