ప్రభాస్ ను కలవరపెడుతున్న 'సాహో'
- March 12, 2018

'బాహుబలి' గ్రాండ్ సక్సస్ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న 'సాహో' పై రోజురోజుకీ అంచనాలు పెరిగి పోతున్నాయి. దీనితో ఈమూవీని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ ఈసినిమా పై దాదాపు 200 కోట్ల వరకు భారీ బడ్జెట్ ఖర్చుపెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు ఈసినిమా పై పెరిగిన అంచనాలుతో పాటు పెరిగిపోయిన బడ్జెట్ కూడ డైరెక్టర్ సుజిత్ పై విపరీతమైన ఒత్తిడి పెంచడమే కాకుండా ఈమూవీని దర్శకుడు సుజిత్ హేండిల్ చేస్తున్న పద్దతి ప్రభాస్ కు ఏమాత్రం నచ్చడంలేదు అన్నవార్తలు హడావిడి చేస్తున్నాయి.
ఇంతవరకు సుజిత్ డైరెక్ట్ చేసింది కేవలం 'రన్ రాజా రన్' చిత్రం ఒక్కటే. ఫన్ మిక్స్ డ్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా హిట్ అయినా ఆఒక్క సినిమా అనుభవం 'సాహో' విషయంలో సరిపోవడంలేదు అని ప్రభాస్ అభిప్రాయం అని అంటున్నారు. దీనితో హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా సాహోను ఎంతవరకు సుజిత్ తీర్చిదిద్దగలడు అన్న డౌట్లు లేటెస్ట్ గా ప్రభాస్ కు ఏర్పడినట్లు సమాచారం. ఇదేతరహా అనుమానాలు బాలీవుడ్ నుంచి కూడ ప్రభాస్ కు అందుతున్న నేపధ్యంలో ప్రభాస్ ను మరింత కలవర పాటుకు గురి అవుతున్నాడు అని టాక్.
దీనికితోడు 'సాహో' ను తెలుగుతో పాటు తమిళం మళయాళం హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్న పరిస్థుతులలో డైరెక్టర్ సుజిత్ కు మల్టీ లాంగ్వేజ్ సినిమాతీసిన అనుభవంలేదు అన్నవిషయాన్ని బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు ప్రభాస్ కు గుర్తుచేస్తున్నట్లు సమాచారం. ఈసినిమా షూటింగుకు సంబంధించి మొత్తం భారమంతా సుజిత్ పైన మోపితే అనుకున్న రిజల్ట్ రావడం కష్టమవుతుందనే అభిప్రాయం ప్రభాస్ కు స్పష్టంగా వచ్చింది అన్నవార్తలు వినపడుతున్నాయి.
దీనితో అతడి సన్నిహితుల సూచనల మేరకు 'సాహో' షూటింగ్ స్పాట్ లో సినిమాటోగ్రాఫర్ మదిని మరింత ఇన్వాల్వ్ చేయడమే కాకుండా తీస్తున్న ప్రతి సీన్ ను తరుచుగా చెక్ చేసుకుంటూ ముందుకు సాగమని ప్రభాస్ మదిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీకి భారీ బడ్జెట్ ఖర్చు అవుతున్న నేపధ్యంలో ప్రభాస్ తన ఇమేజ్ ని కాపాడుకోవడానికి ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తూ ఉన్నా ఈవిధంగా సుజిత్ పై మరీ ఒత్తిడి పెరిగితే మొదటికే మోసం వస్తుందా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే 'సాహో' ప్రభాస్ కు ఒక విషమపరీక్షనే అనుకోవాలి..
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







