నేపాల్: కఠ్మాండూలో కూలిన విమానం
- March 12, 2018

కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం కూలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం బంగ్లాదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థ యూఎస్-బంగ్లాకి చెందినదిగా తెలుస్తోంది. నగరంలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే పై ల్యాండ్ అయ్యే సమయంలో క్రాష్ అయినట్టు కఠ్మాండూ పోస్ట్ తెలిపింది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 78 మంది ప్రయాణికులు ఉన్నారని, వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయని స్థానిక వార్త వెబ్‌సైట్ రిపబ్లికా వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, ఫొటోల ప్రకారం విమానాశ్రయం రన్ వే వద్ద పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడుతున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







