మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో.. పుట్టిన రోజు హంగామా
- March 12, 2018
మెగాస్టార్ చిరంజీవికి కొడుకు రామ్ చరణ్ కంటే.. ఓ పిసరు.. తన ఆడపిల్లలంటేనే ఎక్కువ మక్కువ అని చాలా సార్లు చెప్పారు.. ఎందుకంటే ఆడపిల్లలు.. తల్లిదండ్రులతో ఉండేది.. కొంత కాలం మాత్రమే.. ఆ తర్వాత వేరే ఇంటికి వెళ్లిపోతారు.. అయినా ఆడపిల్ల మహాలక్ష్మి రూపం అని చిరు ఎప్పుడూ చెప్పేవారు.. కాగా ఈ రోజు చిరు.. పెద్ద కూతురు సుష్మిత పుట్టిన రోజు.. ఈ వేడుకను మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఘనంగా జరుపుకున్నది. మెగా ఫ్యామిలీ యంగ్ జనరేషన్ అంతా కలిసి ఒక చోట చేసి.. బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేశారు.. అల్లు అర్జున్, భార్య స్నేహ, సాయిధరం తేజ్, నీహారిక, వరుణ్ తేజ్, శ్రీజ .. ఆమె భర్త కళ్యాణ్.. ఇలా అంతా కలిసి సుష్మితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ హంగామా చేశారు. వేడుక అనంతరం మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా సుస్మిత ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా నటిస్తున్న రంగస్థలం సినిమాకు క్యాస్టుమ్ డిజైనర్ గా చేసింది. తండ్రి సైరా కోసం దుస్తులను రూపొందించే పనిలో ఉన్నది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!