మార్చి 30న వయాంతి 'సామూహిక సూర్య నమస్కారం'

- March 15, 2018 , by Maagulf
మార్చి 30న వయాంతి 'సామూహిక సూర్య నమస్కారం'

మస్కట్‌: వయాంతి యోగా, ఎనిమిదేళ్ళ నుంచి ఆపై వయసున్నవారందరితో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాన్ని మార్చి 30న నిర్వహించబోతున్నారు. సాంగ్రి లా బర్‌ అల్‌ జిస్సాలోని యాంఫీ థియేటర్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. 108 సూర్య నమస్కారాల్ని ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ప్రేమ్‌ నగేష్‌ నేతృత్వంలో వయాంతీ యోగా సంస్థ నడుస్తోంది. ఒమన్‌ క్యాన్సర్‌ అసోసియేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వమిస్తున్నారు. ఒమన్‌లో క్యాన్సర్‌ బాధితులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాకి చెందిన 99 ఏళ్ళ యోగా టీచర్‌ నానమ్మాల్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నానమ్మాల్‌ ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.మార్చి 17 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి మాత్రమే ఈ కార్యక్రమంలో పార్టిపిపేట్‌ చేసే అవకాశముంటుంది. మొదటగా వచ్చిన 500 మందికి యోగా మ్యాట్‌, టీ షర్ట్‌ అందజేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com