నడుం నొప్పితో భామ పడుతున్న కష్టాలు

- March 17, 2018 , by Maagulf
నడుం నొప్పితో భామ పడుతున్న కష్టాలు

స్టార్ హీరోయిన్‌.. నడుం నొప్పి అనగానే వెంటనే మీకు అనుష్క శెట్టి గుర్తొచ్చేసిందా? `సింగం3` షూటింగ్ సమయంలో నడుం పట్టేసిందని, దానివల్ల బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే అనుకున్నంత మేర బరువు తగ్గలేకపోతున్నాననీ ఆ మధ్య అనుష్క చెప్పింది కదా. అందుకే వెంటనే నడుం నొప్పికి, అనుష్క పేరుకు లింకు పెట్టేసుకుని ఉంటారు. అనుష్క కి ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగినట్టేనండీ. కాకపోతే ఇక్కడ మనం చెబుతున్న హీరోయిన్ కూడా కన్నడ హుడుగినే. ఈ భామ ఉత్తరాదిన హల్‌చల్ చేస్తోంది అనుకోండి. ఆమె పేరు దీపికా పడుకొనె.

ఈ మధ్య `పద్మావత్` చిత్రంతో చాలా ఫేమస్ అయిన ఈ భామని ప్రస్తుతం నడుం నొప్పి పట్టి పీడిస్తోందట. ఈ విషయాన్ని దీపిక సన్నిహితులు చెబుతున్నారు. `పద్మావత్‌` సమయంలోనే దీపికకి నడుం నొప్పి విపరీతంగా ఉండేదట. దానికి తోడు డీ3 లోపం కూడా ఉందట. దాంతో తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఒక వైపు ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటోంది ఈ సుందరి. త్వరలో నయం అయితే విశాల్ భరద్వాజ్ సినిమా మొదలుకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com