300 కోట్ల మంది మదిని దోచుకున్న పాట తెలుగులో..!
- March 17, 2018
సంగీతానికి భాషతో పనేముంది. ఏ భాషలో ఉన్నా సంగీత ప్రియులని అలరిస్తుంది. ప్రకృతిలోని ప్రతి ప్రాణీ సంగీతానికి స్పందిస్తుంది. మనకి తెలిసిన భాషలో ఉంటే ఇంకా మంచిది. ఆ పదాల్లో భాషా పాండిత్యం మిళితమై ఉంటే పరవశించని హృదయం ఉండదు. సంగీత, సాహిత్యాల మేళవింపుతో కమ్మని పాట చెవులకు వినసొంపుగా ఉంటుంది. మరి అలాంటి ఓ పాట విడుదలైన 16 వారాల్లోనే 300 కోట్ల మంది వీక్షకుల్ని సొంతం చేసుకుందంటే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలుస్తోంది. డెస్పాసిటో.. స్పానిష్, ఇంగ్లీష్ లిరిక్స్‌తో వచ్చిన ఈ పాటను ప్యూర్టోరికోకి చెందిన గాయకులు లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీలు కంపోజ్ చేశారు. విడుదలైన కొద్ది వారాల్లోనే అత్యధిక వ్యూయర్ షిప్‌ని సొంతం చేసుకున్న పాట ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పేరడీలు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పడు తెలుగులో కూడా వచ్చేసింది. ఈ పాటను తెలుగులో ప్రముఖ గాయకుడు నోయల్, గాయని ఎస్తర్ నొరాహలు కలిసి పాడారు. తెలుగులో వచ్చిన ఈ పాట కూడా సంగీత ప్రియుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!