దొంగతనం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌

దొంగతనం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌

మస్కట్‌: నలుగురు పౌరుల్ని దొంగతనం కేసులో రాయల్‌ ఒమన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులమని నమ్మించి, వీరు దోపిడీలకు పాల్పడుతున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. మస్కట్‌లో సుమారు తొమ్మిది వేర్వేరు కేసులు వీరిపై నమోదయ్యాయి. నిందితులు, తమ నేరాన్ని అంగీకరించినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. నిందితుల్ని తదుపరి చర్యల నిమిత్తం జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు. 

 

Back to Top