మామిడికాయ పులిహోర
- March 17, 2018కావలసినవి:
బియ్యం- ఒక కప్పు, పచ్చిమామిడికాయ తరుగు- ఒక కప్పు, ఉప్పు-తగినంత, పసుపు-1/8 టీస్పూను.
తాలింపు కోసం:
నువ్వులనూనె- మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- అర టీస్పూను, మినపప్పు-రెండు టీస్పూన్లు, శెనగపప్పు- ఒక టేబుల్‌స్పూను, కరివేపాకు-గుప్పెడు, ఇంగువ-చిటికెడు, అల్లం- చిన్నముక్క (తరిగి), పల్లీలు-మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి-మూడు (సన్నగా, పొడుగ్గా తరిగి), ఎండుమిర్చి- మూడు.
తయారీవిధానం:
బియ్యంలో సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికిన అన్నాన్ని పెద్ద పళ్లెంలో పోసి పైన ఒక టీస్పూను నువ్వుల నూనె చల్లాలి. పల్లీలను నూనె వేయకుండా వేగించి పొట్టు తీసేయాలి. కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు మినపప్పు, శెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పల్లీలు వేసి వేగించాలి. ఆ తర్వాత అల్లం తరుగు కూడా వేసి కొంచెంసేపు వేగించాలి. ఆ తర్వాత పసుపు, మామిడి తరుగును వేసి మూడు నిమిషాలు గరిటెతో అటు ఇటు తిప్పాలి. ఆ తరువాత ఉప్పు వేయాలి. ఈ తాలింపును అన్నంలో వేసి అంతా బాగా కలిసేలా కలపాలి.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము