నాల్గోసారి రష్యా అధ్యక్ష పీఠం పుతిన్‌కే!
- March 18, 2018
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తిరుగులేని విజయం సాధించారు. దీంతో నాల్గోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారాయన. మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్. ఓటర్లు పుతిన్‌కే పట్టం కడతారని వెల్లడించాయి. అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. 73 శాతం ఓట్లతో పుతిన్ మరోసారి విక్టరీ కొట్టారు. మరో ఆరేళ్లపాటు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగనున్నారు. 'పవర్‌ఫుల్ నేషన్. పవర్‌ఫుల్ లీడర్' ఇదే రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ నినాదం. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 10 కోట్ల 7 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో దాదాపు 73 శాతం ఓట్లు పుతిన్‌కే పడ్డాయి. బ్రిటన్, టర్కీతో విబేధాలు, ఇతర దేశాలతో సమస్యలు పరిష్కరించాలంటే పుతినే అధ్యక్షుడిగా ఉండాలని రష్యల్లు భావించినట్టుగా స్పష్టమవుతోంది.
పుతిన్‌కి వ్యతిరేకంగా మొత్తం ఏడుగురు అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. కీలక ప్రత్యర్థి అలెక్సీ నావల్సీని న్యాయపరమైన కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే అందిరినీ వెనక్కి నెట్టి పుతిన్‌కే పట్టం కట్టారు రష్యా ప్రజలు. 1999 నుంచి దేశాధ్యక్ష పదవిలో ఉన్న పుతిన్. ఈసారి కూడా గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అనుకున్నట్టే ఈ సారి కూడా ఆయనే గెలవడంతో 2024వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు రష్యాకు అధ్యక్షుడిగా 30 ఏళ్ల పాటు పాలించిన రికార్డు స్టాలిన్‌కు ఉండగా. నాల్గోసారి గెలిచిన పుతిన్. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగిన రికార్డును సొంతం చేసుకోనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







