13 ఏళ్ళ బాలిక నుంచి 1 కిలో ట్యూమర్‌ తొలగింపు

- March 19, 2018 , by Maagulf
13 ఏళ్ళ బాలిక నుంచి 1 కిలో ట్యూమర్‌ తొలగింపు

యూఏఈ:యూఏఈలో 13 ఏళ్ళ బాలిక ఎడమ రొమ్ము నుంచి కిలో బరువైన ట్యూమర్‌ని తొలగించారు వైద్యులు. తొలగించిన ట్యూమర్‌ స్థానంలో పూర్తిగా ఆ రొమ్ము భాగాన్ని రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సర్జరీ జరిగిన రెండు రోజుల తర్వాత ఆ బాలికను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయడం జరిగిందని తవామ్‌ హాస్పిటల్‌ జనరల్‌ సర్జరీ మరియు రీకన్‌స్టిట్యూషన్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సులేమాన్‌ నజీబ్‌ షాంతూర్‌ చెప్పారు. బ్రెస్ట్‌ రిపెయిర్‌ ప్రక్రియలో సిలికాన్‌నని వినియోగించినట్లు చెప్పారు. ఈ మొత్తం సర్జరీ ప్రక్రియ పట్ల బాలిక, ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారని డాక్టర్స్‌ టీమ్‌ వివరించింది. ట్యూమర్స్‌ ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయనీ, ప్రతి మహిళా అనుమానం వస్తే తప్పనిసరిగా బ్రెస్ట్‌ స్క్రీనింగ్‌ చేసుకోవాలని వైద్యులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com