శ్రీదెవికి స్థానాన్ని మాధురి దీక్షిత్ భర్తీ చేస్తుంది: శ్రీదెవి తనయ జహ్నవి
- March 20, 2018
శ్రీదేవిని దేశమే మర్చిపోలేక పోతోంది ఇంకా! మరి కుటుంబం మరవటం చాలా కష్టం. అయితే కాలం మాత్రమే ఎంతటి పెద్ద గాయాల్ని అయినా మానుపుతుందని అటారు.
అయితే ప్రస్తుతానికి మాత్రం శ్రీదేవి మరణం నుండి ఆ ఙ్జాపకాల నుండి పూర్తిగా కోలుకోలేకపోతుంది కూతురు జాహ్నవి. శ్రీదేవి హఠాన్మరణంతో ఒక్క సారిగా మూగపోయిన జాహ్నవి తన తల్లిని స్మరించని క్షణం లేదట. దానికి ఋజువు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో భావోద్వేగం తో చేసిన పోస్ట్ లే.
బోనీ కపూర్ తో వివాహనంతరం చిత్ర సీమకు వీడ్కోలు చెప్పేసిన శ్రీదేవి, "ఇంగ్లీష్ వింగ్లీష్" సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆమె ఆఖరు సినిమా "మామ్" లో నటించారు శ్రీదేవి. ఈ రెండు సినిమాలతోనే తన పూర్వవైభవాన్ని తిరిగి అందిపుచ్చుకున్న శ్రీదేవితో వరుస చిత్రాలను చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు "క్యూ" లో నిలబడ్డారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఒక చిత్రంలో శ్రీదేవి నటిచాల్సి ఉండగా, శ్రీదేవి మరణంతో ఆ స్థానాన్ని మాధురి దీక్షిత్‌తో భర్తీ చేయాలని నిర్ణయించారు ఆయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ "ఇన్‌స్టాగ్రామ్" లో భావోద్వేగంతో కూడిన ఒక పోస్టు చేసింది కూతురు జాహ్నవి. కరణ్ జోహార్ నిర్మాణసారధ్యంలో అభిషేక్ వర్మన్ (2 స్టేట్ ఫేం) తెరకెక్కిస్తున్న తాజా చిత్ర కథ అమ్మ హృదయానకి హత్తుకుంది. "చాలా వరకూ అమ్మను గుర్తుచేస్తుంది ఈ చిత్రం. ఈ అందమైన చిత్రంలో భాగం కాబోతున్న మాధురిజీ కి - డాడీ, ఖుషీ, నా తరుపున చాలా కృతఙ్జతలు" అంటూ మాధురి దీక్షిత్, శ్రీదేవి కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది జాహ్నవి. ప్రస్తుతం జాహ్నవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. అమ్మ అమ్మే కదా! మరపు చాలా అసాధ్యం. అయితే నాడు శ్రీదేవికి చిత్రసీమలో సరైన పోటీ మధురి మాత్రమే. అయినా ఇద్దరు మంచి స్నేహితులు. బహుశ మాధురి ఆ సినిమాకు న్యాయం చేసి శ్రీదేవికి మరోసారి మన స్మృతిపథం లోకి తెస్తుందెమో! అయితే ఆ సినిమా పేరు "షిదాత్" అంటే "ఇష్టంగా నిరీక్షించటం" .
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







