చిన్నారి కిడ్నాప్: బహ్రెయినీ వ్యక్తికి 12 1/2 ఏళ్ళ జైలు శిక్ష
- March 22, 2018
మనామా: బహ్రెయిన్‌కి చెందిన ఓ వ్యక్తికి న్యాయస్థానం పన్నెండున్నరేళ్ళ జైలు శిక్ష విధించింది. 2016లో జరిగిన కిడ్నాప్ ఘటనకు సంబంధించి న్యాయస్థానం నిందితుడ్ని దోషిగా నిర్ధారించి, ఈ శిక్ష ఖరారు చేసింది. నిందితుడిపై కిడ్నాప్, సెక్సువల్ హరాష్‌మెంట్, పోలీసులపై దాడి, దొంగతనం, డ్రగ్స్ అబ్యూజ్ తదితర అభియోగాలు మోపబడి, నిరూపించబడ్డాయి. ఆగస్ట్ 2న హూరాలోని ఓ కమర్షియల్ రోడ్డులో ఈ దొంగతనం జరిగింది. సారా అనే చిన్నారి తల్లిదండ్రులు, కారులో తమ చిన్నారిని వదిలి, పక్కనే వున్న ఓ షాప్‌లోకి వెళ్ళగా, నిందితుడు ఆ కారుని దొంగిలించాడు. ఈ ఘటన బహ్రెయిన్ సమాజాన్ని షాక్‌కి గురిచేసింది. సోషల్ మీడియాలో సారా కోసం పెద్ద స్థాయిలో ఉద్యమమే జరిగింది. భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, బహ్రెయిన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. కేసుని ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి సెంట్రల్ మనామాలోని ఓ ఫ్లాట్‌లో తన ప్రియురాలితో కలిసి నిందితుడు వుండగా అతన్ని అరెస్ట్ చేశారు. బాలిక సారాను రక్షించారు. బహ్రెయిన్ ప్రభుత్వం చూపిన చొరవను భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అభినందించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







