వియత్నాంలోని హో చి మిన్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం..13 మంది మృతి
- March 22, 2018
హానోయ్ : వియత్నాంలోని హో చి మిన్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ నివాస సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సుమారు 13 మంది మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన మూడు బిల్డింగ్లలో సుమారు 700 ల అపార్టుమెంట్లు ఉన్నాయని, వీటిని 6 సంవత్సరాల క్రితమే నిర్మించారని అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది మంటల్లో చిక్కుకున్నదనే విషయం, ప్రమాదానికి గల కారణాలు అధికారులు తెలియజేసేందుకు నిరాకరిస్తున్నారు.
చాలా మంది ప్రజలు గందరగోళంలో భవనంపై నుంచి దూకడం వల్ల చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం కింద ఫ్లోర్లో చోటుచేసుకోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదస్థలంలో సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వియత్నాంలో 2002 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 మంది ప్రజలు చనిపోయారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







