'ఎయిర్ ఏషియా' ఎయిర్‌లైన్స్ వారి సమ్మర్ ఆఫర్
- March 23, 2018
ముంబై: ఎయిర్ ఏషియా విదేశీటికెట్లపై సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో విదేశీ విమాన టిక్కెట్లపై తగ్గింపును రేటును ప్రకటించింది. అన్నీ కలుపుకొని రూ.1,999 టికెట్ ప్రారంభ ధరలో టికెట్‌ను ఆఫర్చేస్తోంది. కౌలాలంపూర్, బ్యాంకాంక్,లాంగ్‌కవి బాలి, ఫూకట్, సింగపూర్ రూట్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్. ఈనెల 25వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రమోషనల్ ద్వారా టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ అనుమతి సెప్టెంబర్ 30,2018 న ముగుస్తుంది.
భారతదేశంలోని అనేక ప్రదేశాల నుంచి కౌలాలంపూర్, సింగపూర్, జకార్తా, సిడ్నీ, బాలి, ఎయిర్ ఆసియా విమాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలోని కొచ్చి లాంటి వివిధ ప్రదేశాల నుంచి కోలాలంపూర్, సియోల్, పెర్త్, ఆక్లాండ్ వంటి ఇతర ప్రదేశాల నుంచి ఎయిర్ ఏషియా డిస్కౌంట్ టికెట్లు అందిస్తోంది. ముఖ్యంగా జైపూర్-కౌలాలంపూర్-ఫుకెట్ (రూ .6,818), జైపూర్-కౌలాలంపూర్-హనోయి (రూ .7,556), జైపూర్-కౌలాలంపూర్-లాంబోక్ (రూ .7,738), న్యూఢిల్లీ-కౌలాలంపూర్ (రూ .8,999), తిరుచిరాపల్లి-కౌలాలంపూర్-హనోయి (రూ.7,401). దీంతోపాటు ప్రీమియం ఫ్లాట్‌బెడ్ విమానాల్లో న్యూఢిల్లీ- కౌలాలంపూర్-ఫుకెట్ మధ్య టికెట్ రూ .20,157 ప్రారంభ ధరగా ఉంది. మిగిలిన వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌ను పరిశీలించగలరు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







