'ఎంతసక్కగున్నావే' సాంగ్ ప్రొమో
- March 23, 2018
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఈ నెల 30 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషర్ వర్క్ భారీ ఎత్తున చేస్తున్నారు. సినిమా పాత్రలకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటీ రిలీజ్ చేస్తున్నారరు. ఇటీవలే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను జరిపి చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకోగా, రెండు రోజుల క్రితం 'రంగ రంగ రంగస్థలాన' ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఈ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ అదరగొట్టాడని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ లో సాగిన ఈ సాంగ్ డాన్స్ ప్రియులకు బాగా ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈమూవీలో సమంత హీరోయిన్.. ఇటీవలే ఈ మూవీలోని ఎంతసక్కగున్నావే సాంగ్ ను లిరికల్ తో చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఇప్పటి వరకూ ఈ సాంగ్ ను రెండు కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.
ఓ తెలుగు సాంగ్ కి ఈ రేంజ్ లో ఫ్యూస్ రావడం ఇదే మొదటి సారి. 'రంగస్థలం' చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. చంద్రబోస్ సాహిత్యానికి దేవీశ్రీ సంగీతానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా సాంగ్ వీడియో ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.గ్రామీణ నేపథ్యంతో సాగిన ఈ సాంగ్ లో అటు రామ్ చరణ్, ఇటు సమంతాలు చాలా సహజంగా నటించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే ఒక ప్రత్యేక గీతంలో అలరించనుంది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







